ఫైజాన్‌ అహ్మద్‌కు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఫైజాన్‌ అహ్మద్‌కు వీడ్కోలు

Mar 7 2026 7:23 AM | Updated on Mar 7 2026 7:23 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఫైజాన్‌ అహ్మద్‌ వీడ్కోలు కార్యక్రమం గురువారం రాత్రి కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నిర్వహించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ ఏ ఉద్యోగికి అయినా బదిలీలు సర్వసాధారణమన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి, పల్లె, పట్టణ ప్రగతి, ఎన్నికల నిర్వహణ, పలు విభాగాలకు నోడల్‌ అధికారిగా, నిర్మల్‌ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా, ప్రభుత్వ పథకాల అమలుకు విశేష కృషి చేశారన్నారు. బదిలీపై వెళ్లిన జిల్లాలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.

సంతృప్తినిచ్చింది..

ఫైజాన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లాలో పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. విధుల నిర్వహణలో తనకు సహకారం అందించిన కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అధికా రులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం కలెక్టర్‌, పలువురు అధికారులు ఫైజాన్‌ అహ్మద్‌ దంపతులను సన్మానించి, జ్ఞాపికలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement