నివేదికపై నిరసన గళం..!
న్యూస్‌రీల్
నిర్మల్
ఆక్షేపణీయం...
‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం
పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది.
బాధ్యతలు స్వీకరించిన
అదనపు కలెక్టర్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమితులై న బి.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. కరీంనగర్ డీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన నిర్మల్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
సమర్థవంతంగా సేవలు అందించాలి
బ్యాంకర్లు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025– 26 సంవత్సరపు త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.8,409.62 కోట్ల రుణాలు మంజూ రు చేయగా 64.56 శాతం లక్ష్యాన్ని సాధించిన ట్లు తెలిపారు. బ్యాంకులు ప్రజల ఉన్నతికి మ రింత తోడ్పాటును అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలు, సబ్సిడీ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రామ్‌గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
నిర్మల్‌ఖిల్లా/నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన సిఫారసులతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించింది. ఆకునూరి మురళి చైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ నాయకులు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతభత్యాలు అధికంగా ఉన్నాయని పేర్కొనడం, ఉపాధ్యాయ శిక్షణ కోర్సు డీఎడ్ రద్దు చేయమని ప్రతిపాదించడం ఆక్షేపనీయమన్నారు. విద్యా ప్రమాణాలను మరింత పెంచే సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కమిషన్ సిఫారసులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజి నీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల సీట్లు భర్తీ చేయాలని పేర్కొనడం, వేతనాలు అధికంగా ఉన్నాయని పే ర్కొనడం తదితర అంశాలను తీవ్రంగా ఖండించా రు. అసంబద్ధ సిఫారసులు చేసిందని, ప్రభుత్వ వి ద్యావ్యవస్థ నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు.
వ్యతిరేకిస్తున్నాం...
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీతభత్యాలపై చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యావ్యవస్థ బలోపేతానికి సూచనలు చేయాలని ఏర్పాటు చేసిన కమిషన్ ఉపాధ్యాయుల జీతభత్యాలపై వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయం. డీఎడ్ కోర్సు రద్దు చేయమనడం ఆయన అవగాహన లేమికి నిదర్శనం. కమిషన్ సిఫారసులలో 90% తప్పుగా ఉన్నాయి. పనితీరు పరంగా పదోన్నతులకు కొలమానం ఎలా నిర్ణయిస్తారు. – కృష్ణారావు,
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
పూర్వ పాఠశాల విద్యను ప్రాథమిక పాఠశాల విద్యతో కలపడం, బడ్జెట్లో కనీసం 18 శాతం విద్యకి కేటాయించడం లాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై సూచనలు చేయలేదు. ఉపాధ్యాయులకు సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిరాకరించడం సరికాదు. పోరాటాల ఫలితంగా రద్దయిన ప్రొబేషనరీ పీరియడ్‌ను మళ్లీ ప్రతిపాదించడం బాధాకరం. – దాసరి శంకర్,
పెంట అశోక్, టీఎస్‌యూటీఎఫ్, నిర్మల్
నివేదికపై నిరసన గళం..!


