నర్సాపూర్(జి): ఎఫ్‌ఎస్‌వో సుంకరి అలేఖ్య ఉత్తమ మహిళా ఫారెస్ట్ అధికారిగా పురస్కారం అందుకున్నారు. సారంగాపూర్ మండలం ఆలూరుకు చెందిన ఈమె నర్సాపూర్ (జి) మండలంలో ఎఫ్‌ఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల స్థిరమైన నిర్వహణకుగాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీసీఎఫ్, రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక వర్గేస్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. శనివారం బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, ఎఫ్‌డీఓ నాగిని భాను, అటవీ అధికారులు ఆమెను అభినందించారు.


