సారంగపూర్/నిర్మల్ రూరల్: నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్, నిర్మల్ రూరల్ మండలంలోని ధని, బోరిగాం, కంకెట, వైకుంఠాపూర్, వంజర్, ప్యారమూర్, మలక్‌చించోలి, తల్వెద, లంగ్డాపూర్, వెంగ్వాపేట్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవ్యిత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు తీసుకువస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా సాధిస్తానన్నారు. వెంగ్వాపేట్‌లో ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు నరేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి విలాస్, నాయకులు తిరుమలచారి, సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్‌రావు, రవళివిలాస్, జంగం ఆనంద్, ఈర్ల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


