లక్ష్మణచాంద: స్కూల్ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సోన్ ఎస్సై గోపి కథనం ప్రకారం.. సోన్ మండలం వెల్మల్ నుంచి శనివారం ఉదయం నిర్మల్ శ్రీ చైతన్య పాఠశాల బస్సు విద్యార్థులతో నిర్మల్ వైపు వెళ్తోంది. సంఘంపేట్‌కు చెందిన గజ్జల గంగన్న, భీమన్న బైక్‌పై వేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి మూటాపూర్ నుంచి వెల్మల్ వైపు ఎదురుగా వస్తున్నారు. న్యూవెల్మల్ శివారు గల సరస్వతి కెనాల్ బ్రిడ్జి వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పాఠశాల డ్రైవర్ శంకర్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో మద్యం మత్తులో వేగంగా బైక్ నడిపిన గంగన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


