నిర్మల్‌చైన్‌గేట్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సదస్సుల్లో పాల్గొన్నారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్–అలైవ్), సంక్షేమం, పిల్లల భద్రత – డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ప్రత్యేక అంశాలపై శాఖల వారీగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేలా చూడటమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.


