దస్తురాబాద్: రైతులు పీఎం కుసుమ్ పపథకాన్ని వి నియోగించుకుని లబ్ధి పొందాలని విద్యుత్‌శాఖ ఎస్ ఈ సుభాష్ సూచించారు. మండలంలోని బుట్టా పూర్ గ్రామంలో ఈ పథకం ద్వారా రెండు మెగావా ట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగా, శుక్రవారం టీజీ ఎన్‌పీడీసీఎల్, టీజీ రెడ్కో అధికా రులు శాఖాపరమైన అనుమతులు, సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సమీపంలోని 33/11 కేవీ వి ద్యుత్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. పీఎం కుసుమ్ ప థకానికి రాష్ట్రంలో 1,150 మంది రైతులు నమోదు చేసుకోగా, తెలంగాణ డిస్కంలకు 25 ఏళ్ల సోలార్ విద్యుదుత్పత్తికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగా యని తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తి చేసిన ప్రతీ యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు నాగరాజు, తిలక్, టీజీ రెడ్కో మేనేజర్ శ్రీనివాస్, జోట ర్ రెన్యువబుల్ ప్రతినిధులు నరేశ్, అన్వేశ్, ప్రాజెక్ట్ డెవలపర్ వెన్నమనేని శ్రీధర్‌రావ్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


