నిర్మల్‌కు రైలొచ్చింది! | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌కు రైలొచ్చింది!

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

నిర్మల్‌ఖిల్లా: పట్టాలే వేయలేదు.. నిర్మల్‌కు రైలు ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే. జిల్లాలో పట్టాలపై రైలు పరుగులు తీయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజలకు సోమవారం రాత్రి ఓ దృశ్యం కనిపించింది. దీంతో కాసేపు ‘‘నిర్మల్‌కు రైలు వచ్చిందోచ్‌!’’ అని ఆసక్తిగా తిలకించారు. భైంసా నుంచి హైదరాబాద్‌కు ఓ భారీ లారీలో రైలు ఇంజిన్‌ను తరలిస్తున్నారు. ఆ లారీ రాత్రి నిర్మల్‌ మీదుగా వెళ్తుండగా పట్టణవాసులు చూసి ఆశ్చర్యపోయారు. చిన్నారులు ఉత్సాహంగా నిర్మల్‌కు రైలు వచ్చేసింది అంటూ కేరింలు కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement