నిర్మల్: ‘మహిళఖిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులు సత్తా చాటుతున్నారు. పోలీసుశాఖలో మహిళా పోలీసు సిబ్బంది ద్వారా పోలీసక్క, నారీశక్తి, శివంగి టీమ్.. ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం సంతోషాన్నిస్తోంది. ఇక్కడ సిబ్బంది కూడా అంకితభావంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతీ సమస్యను ఎదుర్కొనేలా సీ్త్రలు సిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో రాణించగలుగుతాం..’ అని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు.


