నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు రాయనున్న పలువు రు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో శుక్రవారం రాత్రి కలెక్టర్ అభిలాష అభినవ్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. వారిలో మనోధైర్యం నింపారు. పరీక్షల గురించి ఎలాంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో ప్ర శాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించా రు. పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తాను భోజనం చేస్తానని హామీ ఇచ్చారు.


