సృజనాత్మక బోధన..
భైంసారూరల్: మండలంలోని వానల్‌పాడ్ ప్రభుత్వ పాఠశాలలో 18 ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మాదిరి ఎల్లన్న. పదేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరంవిద్యార్థుల అవగాహనపై దృష్టి పెడుతున్నారు. తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శిగా నిలుస్తూ పాఠాలను సరళంగా అందించే పద్ధతుల్లో నిపుణుడు.
రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసలు..
ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోదావరి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్‌లో నిర్మల్ జిల్లా ప్రతినిధిగా పాల్గొని ప్రదర్శన ఆకట్టుకున్నది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ రుషి కుమార్ వశిష్ట చేత ప్రశస్క పొందారు. గత సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
విద్యార్థుల విజయాలు
ఎల్లన్న పనిచేసిన పాఠశాలల్లో గ్రామస్తుల సహకా రంతో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచా రు. ఆయన విద్యార్థులు గురుకుల సీట్లుసాధించి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. వినూత్న విధానాలతో గ్రామీణ విద్యారంగంలో మార్పు తీసుకురావడం ఎల్లన్న ప్రత్యేకత.
ఆనందంగా ఉంది
ప్రాథమికస్థాయి విద్యార్థుల కోసం పప్పెట్రీ విధానంలో పిల్లలకు బోధించడం ఆనందంగా ఉంది. పదేళ్లుగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పాఠశాలకు వెళ్తున్నాను. అక్కడి పాఠశాలకు సమీపంలో ఉండే విద్యార్థులను బడికి రప్పించేందుకు కృషిచేస్తాను. ఇప్పటికే నాకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాలల్లో సులభమైన పద్ధతిలో విద్యా బోధన చేసేందుకు జిల్లాలో సీఆర్టీగా ఎంపిక చేశారు.
– మాదిరి ఎల్లన్న, ఉపాధ్యాయుడు
తోలుబొమ్మలాటతో..
పప్పెట్రీ, స్టిక్ పప్పెట్, గ్లోవ్స్ పప్పెట్, స్ట్రింగ్ ప ప్పెట్ వంటి వాటితో పాఠ్యాంశాలను ఆకర్షణీయ ంగా చెబుతున్నారు. కౌమార దశలో ఉన్న పిల్లల కు భాషా నైపుణ్యాలు, సంభాషణా సామర్థ్యం, సృజనశీలతను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనల ద్వా రా లింగ సమానత్వం, సమాన అవకాశాల అవగా హనను సందేశాత్మకంగా బోధిస్తూ సమాజంలో వివక్షతను తొలగించేందుకు కృషి చేస్తున్నారు.


