నాణ్యమైన భోజనం పెట్టాలి
కడెం: గిరిజన ఆశ్రమ విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వంట గది, సరుకుల కు పరిశీలించారు. వసతిగృహం ఆవరణలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌ను కూల్చివేయాలని, డార్మెటరీ రూమ్స్‌లో టైల్స్, కిటికీలకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలన్నారు. అనంతరం మండలంలోని పాండ్వపూర్ సర్పంచ్ ఆడ విజయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసి తండా, గూడేల్లో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఇందులో డీడీ అంబాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్, మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్‌యాదవ్, వార్డెన్ రాంజీ, హెచ్‌ఎం వసంతరావు, ఎస్సై సాయికిరణ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, బంజార సంఘ నాయకులు మోహన్‌నాయక్, వేణుగోపాల్ పాల్గొన్నారు.


