‘కేంద్రం నిధులతోనే గ్రామాలాభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘కేంద్రం నిధులతోనే గ్రామాలాభివృద్ధి’

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

నిర్మల్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో ని రత్నాపూర్‌ కాలనీ, అక్కపూర్‌, చిట్యాల, ముసిగి, కౌట్లకే, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో ఎస్‌హెచ్‌జీ భవన నిర్మాణం, రూ.10 లక్షలతో వర్కింగ్‌ షెడ్‌ నిర్మాణం, రూ.12లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికా రులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాల ని సూచించారు. రూ.30లక్షలతో చిట్యాల గ్రామంలో వరి ధాన్యం గోదాంలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు హరీశ్‌రెడ్డి, రాజేశ్వర్‌, సుప్రియ, శ్రీనివాస్‌, రాజు, నాయకులు జమాల్‌, రావుల రామనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శుంకుస్థాపన

లక్ష్మణచాంద: సోన్‌ మండలం జాఫ్రాపూర్‌ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో రెండు ఎస్‌హెచ్‌జీ భవనాల నిర్మాణానికి, రూ.20లక్షలతో రెండు వర్క్‌ షెడ్ల నిర్మాణాలకు, రూ.12లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బర్ల రాజారెడ్డి, నాయకులు గంగారెడ్డి, హరీశ్‌రెడ్డి, గంగన్న, మధుకర్‌, నర్సారెడ్డి, రాజేశ్వర్‌, గోరేమియా, సవీన్‌, నరేశ్‌, సంతోష్‌, గంగాధర్‌, పోశెట్టి, నర్సయ్య, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement