నిర్మల్‌ఖిల్లా: కవయిత్రి మొల్లమాంబ జయంతిని జిల్లా కేంద్రంలో తెలంగాణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొల్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొల్ల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సంఘం జిల్లా ప్రతినిధులు కొత్తపల్లి బుచ్చన్న, కొత్తపల్లి గంగాధర్, పోతుగంటి సాయన్న, తోడిశెట్టి పరమేశ్వర్, మారుపాక శ్రీనివాస్, తోడిశెట్టి రవికాంత్, చంద్రయ్య, శంకర్, మల్లేశ్, రమేశ్, సాయికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


