నిర్మల్ రూరల్ గత నెల 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. గురువా రం ఫస్టియర్, శుక్రవారం సెకండియర్ పరీక్షలు ముగియగా విద్యార్థులు ఇంటిబాట పట్టా రు. చివరిరోజు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,960 మందికి 5,518 మంది విద్యార్థులు హాజరు కాగా, 172 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో జాదవ్ పరశురాం జి ల్లా కేంద్రంలోని అల్ఫోర్స్, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలు, దిలావర్‌పూర్ జూనియర్ కళాశాల, కుంటాల మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీ క్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
పరీక్షాకేంద్రం తనిఖీ
కుంటాల: ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఐఈవో పరశురాం తెలి పారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కమల్‌సింగ్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, డీవో వెంకటేశ్వర్ ఉన్నారు.


