నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్: 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య తల్లిదండ్రులకు సూచించారు. నిర్మల్, భైంసా ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలను వేర్వేరుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన జీవన శైలి నేపథ్యంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్నారు. సర్వైకల్ క్యాన్సర్‌తోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్‌లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. డీఎంహెచ్వో రాజేందర్ మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మొదటి దశలో జీజీహెచ్, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలరోజులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు నెలలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో నిర్మల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్, ఆర్‌ఎంవో డాక్టర్ రమేశ్, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వాణాధికారి డాక్టర్ నయనారెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ ప్రీతంరాజ్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.


