హామీల అమలుకే తొలి ప్రాధాన్యం
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అజెండగా ముందుకు వెళ్తామని నిర్మల్ మున్సిపల్ చైర్‌ర్సన్ అప్పాల కావ్య , వైస్ చైర్మన్ గణేశ్‌చక్రవర్తి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లతో సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతీ వార్డులో ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు. నిర్మల్ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న కోతులు, కుక్కల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండుగ దృష్ట్యా ప్రార్థనామందిరాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే పేద వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని తై బజార్ వసూలును రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్‌లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలందరికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లీకేజీలు అరికట్టేలా శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. గతంలో పట్టణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులతో గుర్తించిన పనులు కౌన్సిల్ సభ్యుల తీర్మానంతో రద్దు చేసి, వాటి స్థానంలో స్థానిక వార్డు సభ్యులు గుర్తించిన అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. డీఈ హరిభువన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొనారు.
ఇంటర్ పరీక్షకు 244 మంది గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 6,876 మంది విద్యార్థులకు, 6,627 మంది (96.37%) హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల, ఖానాపూర్ జూనియర్ కళాశాల, ఖానాపూర్ ఆశ్రమ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈవో జాదవ్ పరుశురాం తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
సమావేశానికి హాజరైన సభ్యులు
హామీల అమలుకే తొలి ప్రాధాన్యం


