ఒంటి పూట బడికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

ఒంటి పూట బడికి వేళాయె

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

● ఈనెల 16 నుంచి అమలు.. ● ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు

లక్ష్మణచాంద: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. ఎండ తీవ్రతకు బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది.

జిల్లాలో ఇలా...

జిల్లాలో 577 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉ న్నాయి. ఇందులో 23,398 మంది విద్యార్థులు, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది విద్యార్థులు, 164 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ఉదయం 8 నుంచి..

తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర పాఠశాల డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఒంటిపూట బడులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

‘పది’ పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో..

ఈ నెల 14 నుంది పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మ ధ్యాహ్నం 1 గంటకు విద్యార్థులు రాగానే భోజనం పెట్టి అనంతరం తరగతులు నిర్వహిస్తారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు ఈ నెల 16 నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు ప్రా రంభించాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు తరగతులు నిర్వహించాలి. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. – భోజన్న, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement