రిహాబిలిటేషన్ కింద పాత లోలంలో నా భూమికి బదులు ప్రభుత్వం కొత్త లోలంలో ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం మంజూరు చేసింది. ఐదు సంవత్సరాలు కొత్త లోలంలో ఉన్న తర్వాత నేను నా ఐదు ఎకరాల భూమిని ఒక వ్యక్తికి కౌలుకు ఇచ్చి అంగీకార పత్రం రాయించుకుని పాక్ పట్ల గ్రామంలో స్థిరపడ్డాను. ప్రస్తుతం ఆ వ్యక్తి కౌలు భూమి తనదేనని కోర్టుకు వెళ్లాడు. నా భూమిని నాకు ఇప్పించాలి.
– సిరిగిరి ముత్తవ్వ, పాక్ పట్ల
ఆన్‌లైన్‌లో ప్రభుత్వ
భూమి అని చూపిస్తుంది
నాకు పెంచి గ్రామంలోని సర్వే నంబర్ 375/5/1 లో 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత, ముత్తాతల నుండి వారసత్వముగా సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ భూమి అని ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. అధికారులు రికార్డులు పరిశీలించి ఆన్‌లైన్‌లో సరిచేయగలరు.
– శంకర్, పెంబి


