న్యూస్‌రీల్
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ
బాసర ఆర్జీయూకేటీలో సోలార్ పీవీ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. నాలుగు వారాలు
శిక్షణ కొనసాగుతుంది.
IIలోu
గురువులను గౌరవించాలి
నిర్మల్ టౌన్: విద్యార్థులు గురువులను గౌరవించాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నా రు. గురువుల సూచనలు పాటించి.. మంచి ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమిస్తున్నార ని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డీఈవో భోజన్న, ప్రధానోపాధ్యాయులు వాణి, ఎన్జీవో చైర్మన్ మహేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో చూడగానే వావ్.. అనిపించేలా నైట్ లైటింగ్ వ్యూతో, పచ్చని వాకింగ్ ట్రాక్, కూర్చుని సేదదీరడానికి బెంచీలు, అక్కడక్కడ ఆకట్టుకునే ఫౌంటేన్లతో ఉన్న ఈ చెరువు హైదరాబాద్‌లోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువు. మొన్నమొన్నటి దాకా చుట్టూ ఆక్రమణలతో, డ్రైనేజీ నీటితో దుర్గంధంతో ఉండేది. హైడ్రా దీనిపై దృష్టిపెట్టింది. స్వల్పకాలంలోనే ఆక్రమణలను తొలగించి, చారిత్రక చెరువుకు పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా.. ఓ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసింది.
నిర్మల్: ‘హైదరాబాద్‌లో చారిత్రక చెరువులన్నింటినీ మళ్లీ వెలికితీస్తూ, ఆక్రమణలను తొలగిస్తూ, మురికినీటిని వేరుచేస్తూ.. పూర్వవైభవం తీసుకువస్తున్నారు. అదే చారిత్రక నేపథ్యమున్న నిర్మల్ గొలుసుకట్టు చెరువులను మాత్రం పట్టించుకునే నాథుడు లేడు. అభివృద్ధి, వైభవం ముచ్చట దేవుడెరుగు.. కనీసం మురికినీరు కలువకుండా, ఆక్రమణలకు గురికాకుండా కాపాడేవారు లేరు..’ అని నిర్మల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు జిల్లాకేంద్రం, కలెక్టర్ మొదలు తహసీల్దార్ వరకు, ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నుంచి జూనియర్ ఇంజినీర్ వరకూ ఇక్కడే ఉంటారు. కానీ.. కళ్లెదుటే చెరువులు కబ్జా అవుతున్నా.. చెత్తచెదారం, మురికినీటితో తన ఆనవాళ్లనే కోల్పోతున్నా.. పట్టింపులేటనుల వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డ్రైనేజీలన్నీ చెరువుల్లోకే..
జిల్లాకేంద్రంలో ఇప్పటికీ ఓ డ్రైనేజీ సిస్టం అంటూ లేదు. అన్ని వీధుల మురికినీళ్లన్నీ సమీపంలోని ఏదో ఒక చెరువులోకి వెళ్లాల్సిందే. నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు మురికికుంటలుగా, డ్రైనేజీ ట్యాంకులుగానే ఉపయోగపడుతున్నాయి. వాటిల్లో మురికినీరు చేరడంతో గుర్రపుడెక్క, దోమలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మంచినీటితో గొలుసుకట్టు చెరువులను కలిపిన జౌళినాళా ఇప్పుడు పాతబస్తీలో ప్రధాన మురికికాలువలా మారింది.
వేడుకలకు వేదికలుగా..
హైదరాబాద్‌లో ఒకప్పుడు కబ్జాలతో మురికికూపాలుగా ఉన్న చెరువులు ఇప్పుడు రాష్ట్రస్థాయి వేడుకలకు వేదికలుగా మారుతున్నాయి. వాటి చెంతనే బతుకమ్మ ఉత్సవాలు, కై ట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లోనూ కనీసం కొన్ని చెరువులనైనా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాగూ పార్కుల పెట్టేంతా స్థలాలు వదిలిపెట ్టలేదు. ఇలా చెరువుల వద్దనైనా పచ్చదనం, ఆహ్లాదాన్ని పెంచాలంటున్నారు. మురుగునీటిని చేరకుండా చేయడమే కాకుండా పూడికతోపాటు, చెరువుల్లో ఆక్రమణలనూ తొలగించాలని, మన చెరువులకూ అభివృద్ధి ‘భాగ్యాన్ని’ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగని
ఆక్రమణలు..
ఈ ఫొటో జిల్లాకేంద్రంలోని మంజులాపూర్–ప్రియదర్శినీనగర్ మధ్యలో గల చిన్నరాంసాగర్ చెరువుది. చుట్టూ ఉన్న కాలనీల డ్రైనేజీలన్నీ ఇదే చెరువులో కలుస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు చుట్టూ ఆక్రమణలు. ఓవైపు మురికినీటి దుర్గంధం, మరోవైపు బడాబాబుల కబంధహస్తాలతో విశాలమైన చెరువు కుచించుకుపోతోంది. చుట్టూ కాలనీలకు దుర్గంధాన్ని పంచుతూ, దోమలు, పాములను పెంచుతోంది. ఇదొక్క చెరువే కాదు.. జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులన్నింటిదీ ఇదే దుస్థితి.
హైదరాబాద్‌లో హైడ్రాలా ఇక్కడా పనిచేస్తామంటూ జిల్లా అధికారులతో కూడిన లేక్ కమిటీ చెబు తున్నా.. చెరువుల్లో ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. అప్పుడప్పుడు, ఒకట్రెండు చెరువుల్లో ఆక్రమణల తొలగింపు పేరిట మట్టిని తీయడం, హద్దురాళ్లను కూల్చ డం చేసి చేతులు దులుపుకుంటున్నారు. చెరువుల రక్షణ కోసం కోర్టులు ఇచ్చిన ఒక్క ఆదేశాన్నీ అధికారులు అమలు చేయడం లేదు.


