నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం బొజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మండల, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పార్టీ కోసం శ్ర మించి పని చేసే వారికి కమిటీలో అవకాశం అవకా శం ఇచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి చంద్రశేఖర్‌గౌడ్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అవేజ్, ఎంబడి రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


