నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్దే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేశ్‌చక్రవర్తి హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వేణుగోపాలచారితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని గురువారం కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను సమన్వ యం చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అ భివృద్ధికి సహకారం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నిర్మల్ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సుదర్శన్‌రెడ్డి భరోసా ఇచ్చినట్లు చైర్ పర్సన్ తెలిపారు.


