విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి

Mar 11 2026 8:29 AM | Updated on Mar 11 2026 8:29 AM

● ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ యాదవ్‌

లక్ష్మణచాంద: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సోన్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు, గ్రామస్తులకు విపత్తులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తూ అవగాహన కల్పించారు. భారీ వర్షాలతో వరదలు ఏర్పడినప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువవుతున్న దృష్ట్యా వేడి గాలులు వీచినప్పుడు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు వరదలు సంభవించి నప్పుడు తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. తహసీల్దార్‌ మల్లేశ్‌, ప్రధానో పాధ్యాయురాలు ఆరాధన, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్‌, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement