అనుక్షణం.. భయం భయం!
న్యూస్‌రీల్
నిర్మల్
వినూత్నం గిరిజన హోలీ
ఆదివాసీ గిరిజనులు ‘దురాడి’ పేరుతో హోలీ ని విభిన్నంగా జరుపుకొంటారు. సంప్రదా యాలకు అనుగుణంగా పండుగ చేసుకోవ డం వీరికి ఆనవాయితీగా వస్తోంది.
‘ఉపాధి’పై పర్యవేక్షణ ఏది?
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
భైంసాటౌన్: తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా 12 మంది బాలురు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఎస్సైలు ఉన్నారు.
నిర్మల్‌ఖిల్లా: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన వలస కార్మికులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇ క్కడి వారి కుటుంబాల్లోనూ ఏం జరుగుతుందోన న్న ఆందోళన నెలకొంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ఆయా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయని అక్కడి వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని చె బుతూనే తమలో భయాందోళన నెలకొందని వెల్ల డిస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలతో అక్కడి ప్రజల్లో భీతి నెలకొంది. ఈ ప్ర భావంతో ఆయా దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
అప్రమత్తం చేసిన రాయబార కార్యాలయాలు
యూఏఈ, సౌదీఅరేబియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికే భారతీయులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అవసరమైతే సమీప రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవా లని విజ్ఞప్తి చేస్తున్నాయి. జిల్లాలోని వలస కార్మికుల కుటుంబ సభ్యులు తమ బంధువుల క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు సద్దుమణగాలని, తమ వారు సురక్షితంగా స్వదేశానికి చేరాలని కోరుకుంటున్నారు.
బాంబుల మోతతో భయభ్రాంతులు
ఇరాన్‌తో పాటు ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీఅరేబియా తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చే స్తుండగా మరోవైపు అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయిల్ దేశం ఇరాన్‌పై పరస్పరదాడులకు దిగుతుండడంతో ఆయా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మా రుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళ్లి ఆయా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితిపై వా రి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై తే ఆయా దేశాలు భద్రత చర్యలు చేపడు తుండగా సురక్షితంగానే ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఎక్కడి నుంచి క్షిపణి దాడులు ముంచుకొస్తున్నాయో.. తెలియకపోవడంతో బాంబులు పడిన శబ్దాలతో తాము భయభ్రాంతులకు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు.
విధులు లేక గదికే పరిమితం
గజ్జలమ్మదేవికి పూజలు
కుంటాల: మండలకేంద్రంలోని గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఆలయంలో పూజలు చే శారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
‘ఆడ ఎట్లున్నది బిడ్డా.. అంతా మంచిదేనా.. బాంబులు వడుతున్నయని టీవీలల్ల చెప్తున్నరు.. ఉన్నొక్కడివి బతుకుదెరువు కోసం పెండ్లంపిల్లగాళ్లను ఇడిసి దేశం పోతివి.. ఈ వార్తలు సూసి భయమనిపియ్యవట్టే బిడ్డా..’
ఇది ముధోల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన ఓ తల్లి కువైట్‌లో ఉంటున్న తన కొడుకుకు ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీసిన తీరు.
‘ఏమండి బావున్నారా.. పిల్లలు గుర్తుచేస్తున్నరు.. టీవీల్లో, ఫోన్లలో చూసి మన పిల్లలు అడుగుతున్నరు.. దేశాల మధ్య బాంబు దాడులు జరుగుతున్నయట నిజమేనా..? ఎట్లున్నది పరిస్థితి..? అంత మంచిదేనా..?
ఇది నిర్మల్ జిల్లాకు చెందిన ఓ గృహిణి కువైట్ దేశంలో ఉన్న తన భర్తకు ఫోన్ జేసి వాకబు చేసిన తీరు.
బహ్రెయిన్ దేశంలోని అస్కర్ ప్రాంతంలో ఉంటున్న కడెం మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఎం.రాజేందర్ ఇప్పటికై తే సురక్షితంగానే ఉన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విధులు లేక రూమ్‌లోనే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాలు ప్రమాద హెచ్చరిక జారీ చేశాయని, అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని నిబంధనలు కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. తనతోపాటు అదే మండ ల ంలోని సారంగపూర్ గ్రామానికి చెందిన మిగతా ముగ్గురు మిత్రులు కూడా నివాస గదికే పరిమితమైనట్లు ఆయన తెలిపారు.
అనుక్షణం.. భయం భయం!
అనుక్షణం.. భయం భయం!
అనుక్షణం.. భయం భయం!


