బాసర: బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారికతపై జరిగిన ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలో నియోం లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్?ట్టమెంట్ డైరెక్టర్గా పని చేసిన ఎల్జా జెజేరేనియా ఆన్‌లైన్‌ద్వారా మాట్లాడారు. ఆధునిక సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారని, గ్లోబల్ స్థాయిలోవారికి లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, మహిళలు తమలోని శక్తిని గుర్తించి ప్రతీరంగంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థినుల కోసం తాము వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాము స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాలలో సరికొత్త దిశలో అవకాశాలను కల్పించామని, ఇది ప్రతీ సంవత్సరం పెరుగుతున్న బాలికా విద్యార్థుల(గర్‌ల్స్ స్టూడెంట్స్) చేరికల సంఖ్య ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కే రాములు, సభ్యులు రమాదేవి, లకుమాదేవి, నాగలక్ష్మి, సారిక, ప్రవళిక, శ్రీవిద్య, శ్వేత, శిరీష, బద్రి నారాయణ్, అసోసియేట్ డీన్లు శేఖర్ శీలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


