ఖానాపూర్: ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. బుధవా రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. న ల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కా పాడే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని, ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేర్లు వచ్చిన వారంతా నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ముసు గు గంగవ్వ, కార్యదర్శి నారపాక పరిమళ, బ్లా క్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ తస్లీమా, ఖానాపూర్, కడెం, మామడ మండలాల అధ్యక్షులు కలమడుగు శారద, సురేఖ, లక్ష్మి, కౌన్సి లర్ తిరుమల, నాయకురాలు రేఖ ఉన్నారు.


