పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

లోకేశ్వరం: ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాంనాయక్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్వరం పరీక్షాకేంద్రంలో ద్వితీయ సంవత్సరం పరీక్షకు 120 మంది హాజరు కావాల్సి ఉండగా 117 మంది హాజరైనట్లు తెలిపారు. ఆయన వెంట సీఎస్‌ విఠల్‌ ఉన్నారు.

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

నిర్మల్‌ రూరల్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి. బుధవారం సెకండియర్‌ విద్యార్థులకు బాటనీ/గణితం/పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,227 మంది విద్యార్థులకు గాను 6053 మంది హాజరు కాగా, 174 మంది గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి జాదవ్‌ పరశురాం లోకేశ్వరం, ముధోల్‌, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement