● బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్
నిర్మల్ టౌన్: వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు కీలకమని, వాటి సంరక్షణ అందరి బాధ్యత అని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ అన్నారు. వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 33 యూనిట్ల శాంపిళ్లను వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను సామాజిక బాధ్యతగా గుర్తించి, తమ వంతుగా సామాజిక సేవ చేయాలని అటవీ సిబ్బందికి సూచించారు. అటవీ సంపదను కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి ఉంటేనే జీవం ఉంటుందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బొబడే, ఎఫ్‌డీవోలు నాగిని భాను, శివకుమార్, రామకృష్ణారావు, అటవీ క్షేత్ర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


