నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదు ట నిరసన తెలిపారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ దరఖాస్తు కోసం ఆన్‌లైన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించి నెలకు రూ.4,016 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన కార్మికులందరికీ పెన్షన్, బకాయిలు చెల్లించా లన్నారు. జిల్లాలో ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పా టు చేయాలన్నారు. నరేంద్రమోదీ తీసుకొచ్చి న 4 లేబర్ కోడ్స్ చట్టాలు వెంటనే రద్దు చే యాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్, (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి గంగాధర్, అ ధ్యక్షురాలు శ్రీజ, కార్యదర్శులు స్వరూప, స మీనా బేగం, కే.లక్ష్మి, బి.జ్యోతి పాల్గొన్నారు.


