దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

Mar 11 2026 8:29 AM | Updated on Mar 11 2026 8:29 AM

భైంసా: ముధోల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ఆలయాలకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం అందజేశారు. లోకేశ్వరం మండలం వటోలి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం ఫైలు సీజీఎఫ్‌లో పెండింగ్‌లో ఉందని తెలిపారు. నియోజకవర్గంలో నిర్మాణానికి ప్రతిపాదించిన 12 దేవాలయాల టెండర్‌ ప్రక్రియకు ఆమోదం తెలపాలని కోరారు. ఇంకా 10 ఆలయాలకు సంబంధించిన సీజీఎఫ్‌ మంజూరు ప్రక్రియను పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశా రు. గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని ఆల య అభివృద్ధి, యాత్రీకుల సౌకర్యాల కోసం భారీగా నిధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా మని మంత్రి హామీ ఇచ్చినట్లు విఠల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement