సారంగపూర్: ఇటీవల వరంగల్, హనుమకొండలో నిర్వహించిన జాతీయస్థాయి ఫైటర్ షోటోఖాన్ కరాటే పోటీల్లో మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈపోటీల్లో పాఠశాలకు చెందిన చిన్మయి, బి.అంకిత, చందన బంగారు పతకాలు సాధించగా, బి.ప్రణతి, జి.అశ్విత వెండి పతకాలు, సీహెచ్.స్నేహిత, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించారు. అలాగే పీఎంశ్రీ ఆటల పోటీల్లో వందమీటర్ల పరుగు పందెంలో పాఠశాలకు చెందిన జగశ్రీ వెండి పతకం, లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఆయా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ సంగీత, పీఈటీ సుష్మిత, పీడీ సుప్రియ తదితరులు అభినందించారు.


