భయం వీడితే జయమే | - | Sakshi
Sakshi News home page

భయం వీడితే జయమే

Feb 25 2026 10:29 AM | Updated on Feb 25 2026 10:29 AM

భయం వీడితే జయమే

భయం వీడితే జయమే

● నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ● సూచనలు చేసిన మానసిక వైద్యుడు అల్లాడి సురేశ్‌ ● ప్రధాన అంశాలను రాసుకుంటూ పునరావృత్తం చేయాలి. గంటకోసారి 5 నిమిషాల విరామం తీసుకోండి. ● తాజా నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం, మెదడు అలసిపోకుండా చూసుకోండి. ● 5 నిమిషాల శ్వాస వ్యాయామం, 4 సెకన్లు శ్వాస తీసుకొని బిగబట్టి వదలండి. ● 3 నిమిషాల స్పాట్‌ జాగింగ్‌తో రక్త సరఫరా మెరుగుపరచండి. ● ప్రశ్నలకు సమయం ముందుగానే నిర్ధారించుకోండి. అన్నీ రాసే అవకాశం పెరుగుతుంది. ● తేలికపాటి ఆహారం.. అన్నం, ఇడ్లీ, దోసె తీసుకోవలి. త్వరగా జీర్ణమై శక్తి ఇస్తాయి. ● చికెన్‌, మటన్‌, చేపలు, మసాలాలు, స్వీట్లు, పెరుగు, బిర్యానీలు నివారించాలి.

కేంద్రానికి వెళ్లే వరకు గతంలో చదివిన వాటినే మననం చేసుకోవాలి. కొత్తవి చదివితే ఒత్తిడి పెరుగుతుంది.

ప్రశ్నాపత్రం వచ్చాక అన్నీ చదివి, సులభమైనవి మొదట రాయండి.

సమయం ముగిసే వరకు ఉండి, సమాధానాలు సరిచూసుకోండి.

పరీక్ష తర్వాత చర్చలు మానండి; పోషకులు ఒత్తిడి చేయకండి.

లక్ష్మణచాంద: ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్‌కు వచ్చేసరికి వెనుకబడుతున్నారు. చదువుపై భయం, పరీక్షల సమయంలో తడబడడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. ఈ నేపథ్యంలో మానసిక వైద్యుడు అల్లాడి సురేశ్‌ కొన్ని సూచనలు చేశారు.

చదివే సమయంలో..

● సౌకర్యంగా కూర్చొని 100 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీంతో మెదడుకు రిలాక్స్‌ అవుతుంది.

ఆహార ఎంపికలు

పరీక్షా హాల్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement