హైదరాబాద్: శివాజీ చిత్రపటానికి నెత్తుటి తిలకం దిద్దుదామనుకుని ఓ యువకుడు చేతికి గాటు పెట్టుకోవడంలో పొరపాటున చేతి వేళ్ల నరాలు అరచేతి వరకు తెగిపోయేలా చేసింది. నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఈవెంట్లో భాగంగా ఓ స్కూల్లో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శన ఇస్తున్నాడు. ‘శూర్ వీర్’ అనే పాటలో శివాజీ చిత్రపటానికి తిలకం దిద్దే ఉద్వేగ భరిత సన్నివేశంలో కత్తితో చేతికి చిన్న గాటు పెట్టి నెత్తుటి తిలకం దిద్దాలనుకున్నాడు. కానీ కత్తి చాలా పదునుగా ఉండడంతో కుడిచేతి చిటికన వేలు క్రింది భాగంలో లోతుగా సగం అరచేతి వరకు కట్ అయ్యింది. చిటికెన వేలు, పక్కన వేలుకు వెళ్లే నరాలు, రక్తనాళాలు తెగి తీవ్ర రక్తస్రావమవడంతో చేతివేళ్లు స్పర్ష కోల్పోవడంతో పాటు పనిచేయలేదు. యువకుడు వెంటనే కామినేని ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రిక్టివ్ సర్జన్ డాక్టర్ బి. కృష్ణ చైతన్య తెలియచేశారు.
‘‘ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన యువకుడు గత కొన్నేండ్లుగా వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూళ్లలో కరాటే శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. వృత్తి నిర్వహణలో భాగంగా.. ఈ నెల14న సాయంత్రం ఒక పాఠశాలలో ప్రదర్శన ఇస్తూ, “శూర్ వీర్ ” ఉద్వేగ భరిత పాటకు శివాజీ చిత్రపటానికి నెత్తుటి తిలకం దిద్దే సమయంలో అతడి అర చేతికి లోతైన గాయం అయింది. తీవ్ర రక్త స్రావమవుతుండగా వెంటనే కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీ కు వచ్చారు. వెంటనే కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రిక్టివ్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య పరిశీలించారు. అతని కుడి చేతి రెండు వేళ్ల కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. వేళ్లలోని నరాలు కట్ కావడంతో రెండు వేళ్ల రక్తంలోని ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోయింది. అదే విధంగా స్పర్ష సంబంధిత నరాలు కూడా తెగిపోవడంతో రెండు వేళ్లకు స్పర్ష లేకుండా పోయింది. వెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించాం. చిన్నవేలులోని నరాలు, రక్తనాళాలు, నొప్పి, ఉష్ణోగ్రత వంటి భావనలను మెదడుకు పంపే సున్నితమైన నరాలు, అలాగే చిన్నవేలుకు రక్త సరఫరా చేసే దమనీ రక్తనాళాలకు సర్జరీ చేసి మరమ్మతు చేశాం’’.
‘‘ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కింద సున్నితమైన రక్తనాళాలు, నరాలను మానవ వెంట్రుక కంటే సన్నని సూచర్ తో మరమ్మతు చేశాం. ఈ సర్జరీకి సాంకేతికంగా సూపర్ మైక్రో సర్జరీ అంటారు. శస్త్రచికిత్స ప్రారంభించే ముందు, అతడు ఈవెంట్ వేదికపై ఏ పాటకు ప్రదర్శన ఇస్తున్నాడో అడిగి తెలుసుకున్నాం. అతను “శూరవీర్” పాటకు ప్రదర్శన ఇస్తున్నానని, ఆ సంఘటనకు ముందు ఆ పాట తనను భావోద్వేగానికి గురి చేసింది’ అని చెప్పాడు. అందువల్ల, అతని ఆందోళన తగ్గించి, ధైర్యం పెంచేందుకు అదే పాటను ప్లే చేస్తూ శస్త్రచికిత్స ప్రారంభించాం. శస్త్ర చికిత్స అనంతరం అతను చేతి వేళ్లకు స్పర్ష రావడంతో నొప్పి తెలియడం ప్రారంభమైంది. చిన్నవేలులో రక్త ప్రసరణను మళ్లీ పునరుద్ధరించగలిగాం. ఇదంతా ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి రావడం వల్ల చేతి వేళ్లను కోల్పోకుండా సర్జరీ చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగాం. ’’ అని వివరించారు.
ఈ సందర్బంగా డాక్టర్ బి. కృష్ణ చైతన్య మాట్లాడుతూ "ఈ రకమైన ప్రమాదాలు జరగడం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే శస్త్రచికిత్స అందకపోతే చేతివేళ్లను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ప్రమాదాలు జరిగిన వెంటనే ఆస్పత్రికి రావాలని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: గిరి @9963445785


