క్యాన్సర్‌ 4వ స్టేజ్‌.. ఏకంగా 20 కిలోల కణితి! | Doctors remove 20 kg tumor from the stomach suffering from colon cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ 4వ స్టేజ్‌.. ఏకంగా 20 కిలోల కణితి!

Jan 24 2026 6:02 PM | Updated on Jan 24 2026 6:14 PM

Doctors remove 20 kg tumor from the stomach suffering from colon cancer

ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన  ఆపరేషన్‌ను విజవంతంగా ముగించారు. 43 ఏళ్ల పెద్దప్రేగు క్యాన్సర్ రోగి కడుపునుంచి ఏకంగా 19.9 కిలోల కణితిని తొలగించారు. మల్టీ  ఆమెకు  కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు విజయవంతమైన శస్త్రచికిత్సను ఎయిమ్స్‌ ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన మున్మున్‌ను జూలై 2024లో ఉదర ఉబ్బరం (సాధారణం కంటే పెద్ద బొడ్డు)తో ఆసుపత్రికి తరలించారు.  పాతికేళ్ల క్రితం, యూనిలేటర్‌  సాల్పింగో-ఊఫొరెక్టమీ (ఒక ఓవరీ, ఒక ఫెలోపియన్ ట్యూబ్‌ను) తొలగించారు.

అలాగే స్టేజ్-4 పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  పెల్విక్ ప్రాబల్యం ఉంది.  అనేక ఆసుపత్రులను తిరిగి,  పలు రౌండ్ల  కీమోథెరపీ చేయించుకుంది.  అయినా ఎలాంటి ఫలితం లేదు పైగా  వ్యాధి పెరుగుతూనే ఉంది. కణితి అనేక ఉదర అవయవాలకు వ్యాపిస్తుండటంతో. 3-4 నెలలు ఎక్కువ బతకదని వైద్యులు అంచనా వేశారు.  

అయితు ఎయిమ్స్ ఢిల్లీలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం.డి. రే నేతృత్వంలోని వైద్యుల బృందం జనవరి 12న విజయవంతంగా సైటోరేడక్టివ్ సర్జరీని నిర్వహించి, 19.9 కిలోల కణితిని తొలగించారు.  జనవరి 15న శస్త్రచికిత్సతో పాటు HIPECని పూర్తి చేసి, ఆంకోసర్జికల్ నిర్వహణను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆస్పత్తి డిశ్చార్జ్‌ అయ్యింది కోలుకుంటోంది. 

CT మరియు PET-CT స్కాన్‌ల ఆధారంగా, అంత పెద్ద కణితి ఆపరేషన్‌ ఒకేసారి  చేస్తే రోగి తట్టుకోవడం కష్టమని భావించిన  వైద్యులు రెండు దఫాలుగా దీన్ని పూర్తిచేశారు. పొట్టలోని కొన్ని భాగాలను అంటే. ట్రాన్స్‌వర్స్ పెద్దప్రేగులో మూడింట రెండు వంతులు, సిగ్మోయిడ్ పెద్దప్రేగు, ఓమెంటం, గర్భాశయం ,  రెండు ఫెలోపియన్  ట్యూబ్స్‌, కాలేయం   కాప్యూల్‌, పెరిటోనియంను తొలగించామని డాక్టర్ రే చెప్పారు.

ఇదీ చదవండి: ఫైబర్‌ ఎక్కువ తీసుకుంటే, ఏమవుతుందో తెలుసా

సాధారణంగా కీమోథెరపీలా కాకుండా,  హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో -- కణితిని పూర్తిగా తొలగించిన తర్వాత,  హీటెడ్‌  కీమోథెరపీ (41–43 డిగ్రీల సెల్సియస్)ని నేరుగా ఉదర కుహరంలోకి పంపించండం ద్వారా చికిత్స అందించారు. కణితులన్నీ తొలగించబడ్డాయని నిర్ధారించుకున్నాక, కంటికి కనిపించని సూక్ష్మ వ్యాధిని నిర్మూలించడానికి గంటన్నర పాటు HIPEC చికిత్స అందించారు.మొదటి శస్త్రచికిత్స జనవరి 12న, రెండోదిజనవరి 15న జరిగింది,   ఐదు రోజులకు జనవరి 20న డిశ్చార్జ్ చేశామని డాక్టర్ చెప్పారు.శస్త్రచికిత్స తర్వాత, కణితులు లేకుండా కాలేయం,ప్రేగులు స్పష్టంగా కనిపించాయన్నారు.

కొన్ని కోలన్‌ క్యాన్సర్ కేసులను నయం చేయవచ్చు
పెద్దప్రేగు క్యాన్సర్ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పనటికీ కొన్ని కేసుల్లో నయం చేయ వచ్చ న్నారు. ఇప్పటికీ నయం చేయగలదని రే వివరించారు. నిపుణులైన సర్జన్ల సలహా లేకుండా మెటాస్టాటిక్ పెద్దప్రేగు క్యాన్సర్‌కు  చికిత్స లేదని ప్రకటించకూడదని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్‌ అంటున్న మస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement