ఫోన్‌ చూడొద్దన్న తండ్రి... కొడుకు ఆత్మహత్య | Incident in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చూడొద్దన్న తండ్రి... కొడుకు ఆత్మహత్య

Feb 26 2026 5:47 AM | Updated on Feb 26 2026 12:15 PM

Incident in Hyderabad

బంజారాహిల్స్‌: ఫోన్‌లో వీడియోలు చూడవద్దని, గేమ్స్‌ ఆడవద్దని స్కూల్‌కు క్రమం తప్పకుండా వెళ్లాలని తండ్రి హితవు పలకడంతో భరించలేని 12 సంవత్సరాల విద్యార్ధి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్డు  నంబర్‌ 12లోని ఫస్ట్‌లాన్సర్, సయ్యద్‌ నగర్‌లో నివసించే మహ్మద్‌ అఫాన్‌ ఖాన్‌ (12) సమీపంలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు.

తండ్రి ఇర్ఫాన్‌ ఖాన్‌ వాల్‌ పెయింటింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. మొండివాడిగా ముద్రపడ్డ అఫాన్‌ ఖాన్‌ తండ్రి చెప్పినా వినకుండా ఫోన్‌లో వీడియోగేమ్‌ చూస్తూ స్కూల్‌కు డుమ్మా కొడుతున్నాడు. ఇప్పటికే మూడు స్కూల్స్‌ మారాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్‌ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్‌ ఖాన్‌ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్‌ తన గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement