కరోనాతో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి | Two Persons Died Of Corona In Jangaon | Sakshi
Sakshi News home page

కరోనాతో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి

May 4 2021 2:32 AM | Updated on May 4 2021 11:48 AM

Two Persons Died Of Corona In Jangaon - Sakshi

సుశీల, కృష్ణ, శ్రీనివాస్‌ (ఫైల్‌)

సాక్షి, జనగామ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. గత నెల 27న జన గామకు చెందిన గోనె సుశీల కరోనాతో మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి జనగామలో పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఆమె కుమారుడు గోనెకృష్ణ (58), గంటల్లోనే ఆయన సోదరుడు ఐనవోలు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం పర్యవేక్షకులు శ్రీనివాస్‌ మృతి చెందారు. దీంతో ఒకే కుటుంబంలో కరోనాతో మూడు మరణాలు సంభవించడంతో విషాదం నెలకొంది.  

Advertisement
 
Advertisement
Advertisement