ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు | Covid Cases Increasing In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

Jul 16 2026 9:15 PM | Updated on Jul 16 2026 9:31 PM

Covid Cases Increasing In Andhra Pradesh

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. కోవిడ్‌ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో మొత్తం 12 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తొలి కోవిడ్‌ కేసు జూన్‌ 26న వైఎస్సార్‌ కడప జిల్లాలో నమోదైంది. కడప-8, గుంటూరు-2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కోవిడ్‌ కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ బారిన పడిన 12 మందిలో నలుగురు మృతి చెందారు.

ప్రస్తుతం ముగ్గురు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ముగ్గురు పూర్తిగా కోలుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement