తరగతి గదిలో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ | Student Get Injured In Mobile Battery Explosion In Jangaon | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ

Jan 19 2019 8:47 AM | Updated on Jan 19 2019 8:47 AM

Student Get Injured In Mobile Battery Explosion In Jangaon - Sakshi

సాక్షి, రఘునాథపల్లి : సెల్‌ఫోన్‌ బ్యాటరీ పేలి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడాల శంకర్‌-లక్ష్మి దంపతుల కుమారుడు రాజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలానే స్కూల్‌కు వచ్చాడు. గణితం టీచర్‌ సునీత పాఠం బోధిస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ బ్యాటరీ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలింది. దీంతో విద్యార్థి దవడ, ఛాతీ చేతికి గాయలయ్యాయి. గాయపడిన రాజును స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్‌ బ్యాటరీతో ఆడుతుండగా ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం నర్సింహారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement