రేవంత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం: పొన్నాల

Congress Leader Ponnala Laxmaiah Condemns Revanth Reddy Arrest - Sakshi

జనగామ: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో పొన్నాల మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డిని బలవంతంగా అరెస్ట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనిపిస్తోందని చెప్పారు. జాతీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందన్నారు.

పోలీసులు సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ను కట్టడి  చేయడానికే ఈ కుట్ర జరిగిందని, కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top