యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు | Farmers Struggling For Getting Urea In Telangana | Sakshi
Sakshi News home page

యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు

Sep 13 2019 12:16 PM | Updated on Sep 13 2019 3:34 PM

Farmers Struggling For Getting Urea In Telangana - Sakshi

కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో..

సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కోపరేట్‌ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో  నిలబడి  ఉన్నా ఒక బస్తా యూరియా  మాత్రమే ఇస్తున్నారు.

ఒక  లారీ లోడ్‌లో 506 యూరియా బస్తాలు వస్తే  రోజు వెయ్యి  మంది  నుoచి  1200 మంది  రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని  ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని  రైతులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement