
డిపార్ట్‌మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా తెలిసింది.
సాక్షి, జనగామ: వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ కర్ణుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జనగామ జిల్లా పెంబర్తి శివారు వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డిపార్ట్‌మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
(చదవండి: దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి)