చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు..

జనగామ: జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ వద్ద ఆకేరు వాగులో చేపల వేట కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు నలుగురు యువకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు చెక్ డ్యామ్ వద్ద చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు 23 సంవత్సరాల ఆరూరి వంశీ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో ఆరూరి వంశీని కాపాడడానికి అతని వెంట ఉన్న ఆరూరి శ్రవణ్, పాశం సందీప్, శాగంటి ప్రమోద్ ప్రయత్నించారు.
కానీ ఆరూరి వంశీ ఆచూకీ దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, డీసీపీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆరూరి వంశీ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టిన ఇంకా వంశీ ఆచూకీ దొరకలేదు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి