టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న నిరసన

TRS MLA Muthireddy Yadagiri Reddy Protest Lying On The Floor - Sakshi

సాక్షి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి యశ్వంతపూర్‌ గ్రామం వద్ద శనివారం వినూత్న నిరసనకు దిగారు. జనగామ మున్సిపాలిటి నుంచి యశ్వంతపూర్ వాగులోకి మళ్లించే మురికి కాల్వ విషయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ సుశీల తన తీరు తీరు మార్చుకోవాలని కోరారు. యశ్వంతపూర్‌ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురికి కాల్వ వద్దని చెప్పి గతంలో తెచుకున్న కోర్టు స్టేను వెనక్కి తీసుకోవావాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచ్‌ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. స్టేను వెనక్కి తీసుకుంటేనే అభివృద్ది పనులకి శంకుస్థాపన చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో మాజీ సర్పంచ్ సుశీల తన స్టే వెనక్కి తీసుకొని ఎమ్మెల్యేకి సహకరిస్తానని చేప్పడంతో ఆయన లేచి అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు.

గ్రామస్తుల ఆరోపణలివే..
యశ్వంతపూర్‌ గ్రామస్తుల అభ్యంతరాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. ఫిల్టర్ చేసిన నీటినే వాగులోకి తరలిస్తామని చెప్పారు. అయినా కూడా తనను అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. విషయమేంటంటే.. జనగామ మున్సిపాలిటీకి సంబంధించి మురికి నీటి కాలువ బతుకమ్మ కుంటవద్ద నుంచి నెల్లుట్ల చెరువులోకి చేరుకునేది. ప్రస్తుతం కాలువను యశ్వవంతపూర్‌ వాగులోకి డైవర్ట్ చెయ్యడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్లాన్‌ చేశారు. అయితే, బతుకమ్మ కుంట నుంచి నీటి కాలువ వెళ్లకుండా చేసి ముత్తిరెడ్డి భారీగా లాభ పడుదామని చూస్తున్నారని యశ్వంతపూర్‌ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బతుకమ్మ కుంట కింద వెంచర్ చేయించే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top