చట్టాలపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2023 10:06 AM

సదస్సులో మాట్లాడుతున్న జడ్జి పృథ్వీరాజ్‌  - Sakshi

జనగామ రూరల్‌: విద్యార్థులకు చట్టాలపై అవగా హన ఉండాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి పృథ్వీరా జ్‌ డీటీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్‌ గురుకుల కళాశాలలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. మనుషుల అక్రమ రవాణా, డ్రగ్స్‌ వాడకం, ర్యాగింగ్‌, మైనర్లు వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాది మంచాల రవీందర్‌, రాగళ్ల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపాల్‌ అనిల్‌ బాబు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో..
ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ నర్మద పాల్గొన్నారు. ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలు అప్‌లోడ్‌ చేయవద్దని చెబుతూ.. వాటి వల్ల కలిగే అనర్థాలను జడ్జి వివరించారు. బాలికలు ఎలాంటి సమస్యలు వచ్చినా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలని సూచించారు.

జూనియర్‌ సివిల్‌ జడ్జి పృథ్వీరాజ్‌ డీటీ

Advertisement
 
Advertisement