
జనగామ: తెలంగాణలో అభివృద్ధి..కొత్త కొత్త జీఓలు ఎలక్షన్ టు ఎలక్షన్‌గా మారాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వం పని చేస్తుందని, ప్రతీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి చేయకుండానే, దొంగ జీఓలను విడుదల చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 127 చోట్ల మున్సిల్, కార్పొరేషన్‌లో అసమ్మతి సెగలను కంట్రోల్ చేయని దుస్థితిలో సీఎం ఉన్నారన్నారు. తెలంగాణలో 24 గంటలపాటు కరెంటు సరఫరా ఇవ్వలేని కేసీఆర్ దేశం మొత్తం ఉచితంగా ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.