మావోల పేరుతో బెదిరింపులు

Two Gang Members Were Taken Into Custody By Police At Jangaon - Sakshi

ఇద్దరి అరెస్టు.. రిమాండ్‌

జనగామ: మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జనగామకు చెంది న సెంట్రల్‌ బిర్యానీ సెంటర్‌ యజమాని ఆరె భాస్కర్, జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిమ్మల ప్రభాకర్‌ మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. 2015లో ఇలాంటి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆరె భాస్కర్‌ తిరిగి అదే హోటల్‌లో పని చేస్తున్న ప్రభాకర్‌తో కలసి ముఠాగా ఏర్పడ్డాడు.

ఈ క్రమంలో జనగామకు చెందిన తుమ్మ రాజిరెడ్డి, అతని సోదరుడు బాల శౌరిరెడ్డి వాట్సా ప్‌ నంబర్‌కు చండ్రపుల్లారెడ్డి పేరుతో రూ.25 లక్షలు ఇవ్వాలని మెసేజ్‌ పంపించారు. లేదం టే కుటుంబసభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. అలాగే మరికొందరిని బెదిరించారు. బాధితుల్లో ఒకరైన నర్సింగరావు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 12న ఫిర్యాదు చేశారు. దీంతో ముఠా సభ్యులను పట్టుకునేందుకు సీఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్‌ నాయక్‌ బృందం రం గంలోకి దిగింది. దాడులు నిర్వహించి భాస్క ర్, ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌ కా ర్డులను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌ కు పంపినట్లు డీసీసీ వివరించారు. 24 గం ట ల్లో కేసును ఛేదించిన పోలీసులకు సీపీ రివార్డు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top