మురికి కాలువలో పసిపాప మృతదేహం | baby girl dead body in drainage | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో పసిపాప మృతదేహం

Jan 20 2018 12:12 PM | Updated on Sep 29 2018 5:10 PM

baby girl dead body in drainage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జనగాం: కళ్లు తెరిచి వారం రోజులు కూడా కాలేదు. కానీ నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కాదు కాదు నింపేశారు. ఎవరు చేశారో తెలీదు కాని ఈ ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులకే ఆ పసిప్రాణాన్ని మురికి కాలువలో కలిపేశారు.

వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లాలో మరో దారుణం జరిగింది. కళ్లు తెరిచి వారం రోజులు కాకుండానే రోజుల వయసున్న పసిపాప మృతదేహం మురికి కాలువలో కనిపించింది. పాప చేతికి ఉన్న ట్యాగ్‌పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement