రామచంద్రపురంలో దొంగల బీభత్సం

Jangaon: Theft In Ramachandrapuram - Sakshi

సాక్షి, జనగామ : జిల్లాలోని బచ్చన్నపేట మండల పరిధిలోని రామచంద్రపురంలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్థరాత్రి రామచంద్రపురంలోని 11 ఇళ్లల్లో దొంగతనం చేసి పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top