ఆటోలు ఢీ: ఒకరి మృతి | two autos collided in Jangaon one died | Sakshi
Sakshi News home page

ఆటోలు ఢీ: ఒకరి మృతి

Oct 21 2016 5:27 PM | Updated on Aug 25 2018 6:22 PM

ఆటోలు ఢీ: ఒకరి మృతి - Sakshi

ఆటోలు ఢీ: ఒకరి మృతి

జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి.

జనగామ : జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చంపక్‌హిల్స్ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద శుక్రవారం రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కార్మికులు ఆటోలో సీతాఫలం పండ్లను తీసుకొస్తున్న క్రమంలో జనగామ వైపు వెళ్తున్న మరో ప్రయాణికుల ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో కొన్నెకు చెందిన తేలు రాజు(25) అనే కార్మికుడు మృతిచెందాడు. శంకరయ్య, రాకేష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 12మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement