వీరిచేతుల్లోనే విజయం! | - | Sakshi
Sakshi News home page

వీరిచేతుల్లోనే విజయం!

Feb 7 2026 9:43 AM | Updated on Feb 7 2026 9:43 AM

వీరిచ

వీరిచేతుల్లోనే విజయం!

పురపాలికల ఎన్నికల్లో ఇన్‌చార్జ్‌లదే కీలకపాత్ర లేచింది మొదలు.. ఒక్కో వార్డులో 20 మందికి పైగా జట్టు పరిచయాలతో ముందుకు.. పట్టణంలో పండుగ వాతావరణం..

ఎన్నికల ఫలితాలపై

నాయకుల ప్రభావం..

పురపాలికల ఎన్నికల్లో ఇన్‌చార్జ్‌లదే కీలకపాత్ర

జనగామ: జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రెండుచోట్ల పీఠాలను కై వసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల సర్పంచులు, నాయకులు, స్థానిక ప్రతినిధులు ఇప్పుడు పట్టణ ఎన్నికల్లో కీలక పాత్రధారులుగా మారి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

తెల్లవారుజాము ఆరుగంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఎవరికి వారే తమ బృందాలతో వీధుల్లో తిరుగుతూ పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఓటర్‌ కనెక్ట్‌, ప్రచా ర వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఇన్‌న్‌చార్జ్‌ నాయకులు తమకు అప్పగించిన వార్డులపై పూర్తి ఫోకస్‌ పెట్టారు. వారికి తెలిసిన గ్రామస్తులు, తమ ప్రాంత ప్రజలు జనగామ లేదా స్టేషన్‌ఘనన్‌పూర్‌ పట్టణాల్లో ఓటర్లుగా ఉండడం అభ్యర్థులకు మరింత ప్లస్‌ పా యింట్‌గా మారుతోంది. ప్రతీ ఓటర్‌ను సంప్రదించి సంబంధాలను పటిష్టం చేసి తమ వైపు తిప్పుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

ఎక్కడ చూసినా ఇనన్‌చార్జ్‌ బృందాల హడావిడి, చురుగ్గా తిరిగే కార్యకర్తలదే ఈ ఎన్నికల్లో అసలు పోరు అని చెప్పవచ్చు. ఒక్కో వార్డులో కనీసం 20 మంది వరకు ఇనన్‌చార్జ్‌లు, వార్డు కమిటీ సభ్యులు, సహాయకులు కలిసి ముమ్మరంగా పనిచేస్తున్నారు. పట్టణంలోని ప్రతీ వీధిలో వారి ఉనికి స్పష్టంగా కనిపిస్తోంది. వార్డుల వారీగా ఓటర్‌ లిస్టులు సిద్ధం చేసి, ప్రభావవంతులైన కుటుంబాలను దగ్గర చేసుకోవడం, అసంతృప్తులను చర్చలతో దగ్గరకు చేర్చుకోవడం, గ్రూపుల మధ్య కలహాలను తగ్గించడం వంటి పనులను వారు ఎంతో వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని ఆయా మండలాల నుంచి ఇన్‌చార్జ్‌లుగా వచ్చిన నాయకులు తమ ప్రాంత పరిచయాలను కూడా పూర్తిగా వినియోగిస్తున్నారు. పట్టణంలో నివసిస్తున్న తమ గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు–ఓటరుకు లింక్‌ విధానం అమలు చేస్తున్నారు. స్థానికంగా తమ ప్రభావం ఉన్న కుటుంబాలకు మరింత చేరువై వారిని అభ్యర్థికి అనుసంధానం చేస్తూ రానిఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పురపాలిక ఎన్నికల ప్రచారం పట్టణాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది. రోడ్లపై పార్టీ జెండాలు, గల్లీల్లో నినాదాలు, ఇంటింటికీ తిరిగే ప్రచార బృందాలు ఏ వార్డులోకి వెళ్లినా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్‌న్‌ చార్జ్‌ బృందాల సందడితో పాటు అభ్యర్థుల పాదయాత్రలు, సమావేశాలతో పట్టణంలో సందడి నెలకొంది.

తెల్లవారు లేచింది మొదలు అర్ధరాత్రి వరకు గెలుపు వ్యూహాలు

20 మంది జట్టుగా..అహర్నిశలు శ్రమ

పట్టణాల్లో ఎటు చూసినా సందడే

ప్రతీ ఓటు కీలకం కావడంతో

పక్కా ప్రణాళికలు

సర్పంచులు, రైతు నాయకులు, స్థానిక నేతలు, గత ఎన్నికల్లో ప్రభావం చూపిన ఓటరు గ్రూపులందరూ తమ అభ్యర్థుల వెనుక నిలబడే విధంగా కసరత్తు సాగుతోంది. ఈసారి మున్సిపల్‌ పీఠం కోసం జరిగే పోరులో పార్టీలు కాకుండా నాయకుల వ్యక్తిగత ప్రభావం ప్రచారం గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌న్‌పూర్‌ పురపాలికల్లో ఈసారి ఎన్నికలు తీవ్ర హోరాహోరీ వాతావరణంలో సాగుతున్నాయి. ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల కలసికట్టుగా పోరాటం పట్టణంలోని ప్రతీ ఓటును కీలకంగా మార్చబోతోంది.

వీరిచేతుల్లోనే విజయం!1
1/3

వీరిచేతుల్లోనే విజయం!

వీరిచేతుల్లోనే విజయం!2
2/3

వీరిచేతుల్లోనే విజయం!

వీరిచేతుల్లోనే విజయం!3
3/3

వీరిచేతుల్లోనే విజయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement